సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆస్పత్రిలో యూరాలజీ ల్యాబ్‌లో మంటలు చెలరేగాయి. ఓపీ పేషెంట్ విభాగంలో మూడో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓపీ పేషంట్ విభాగంలోని మూడో అంతస్తులో షార్ట్ సర్కూట్‌తో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
ల్యాబ్‌లోని విలువైన వస్తువులు, పరికరాలు దగ్ధమయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో ల్యాబ్‌లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇవీ చూడండి:గుంటూరు జీజీహెచ్‌లో అగ్నిప్రమాదం