తెలంగాణ

telangana

ETV Bharat / city

స్క్రాప్​ గోదాంలో అగ్నిప్రమాదం... కాలి బూడిదైన సరుకు - fire accident news

హైదరాబాద్​లోని ఓ స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకోగా... గోదాంలోని సరుకంతా దగ్ధమైంది. రెండు యంత్రాల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు.

fire accident in scrap godown in Hyderabad
fire accident in scrap godown in Hyderabad

By

Published : Apr 18, 2021, 3:50 AM IST

హైదరాబాద్​ అబిడ్స్- నాంపల్లి రహదారిలో ఓ స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ దుకాణానికి సంబంధించిన సోఫా సెట్ల తయారీ వ్యర్థాలను ఉంచిన గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది... రెండు యంత్రాల సాయంతో మంటలను అదుపుచేశారు.

ఎటువంటి అగ్నిమాపక శాఖ అనుమతులు లేకుండా ఈ గోదాంను పెట్టినట్లు అధికారులు తెలిపారు. గది నిండా స్క్రాప్​ను నింపటం వల్ల మంటలను ఆర్పేందుకు ఎక్కువ సమయం పట్టింది. సామాగ్రిని బయటకు తీసిన సిబ్బంది... మంటలు పూర్తిగా ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

ABOUT THE AUTHOR

...view details