మూతికి నిప్పు.. అలరించబోయి విలపించాడు..!
VIRAL VIDEO: మూతికి నిప్పు.. అలరించబోయి విలపించాడు..! - telangana news
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని పాత వీధిలో నాగల చవితి సందర్భంగా నిర్వహిస్తున్న నేల వేషాలు కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. సంతోష్ అనే వ్యక్తి నోట్లో డీజిల్ పోసుకుని ఫైర్ చేస్తుండగా... రివర్స్ ఫైర్ అయ్యింది. దీంతో.. నోట్లోనే నిప్పు అంటుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్‌ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలమంచిలి పట్టణంలోని ఉత్సవాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందరూ చూస్తుండగా జరిగిన ఈ సంఘటన.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అయితే.. ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.

అగ్నిప్రమాదం, నాగుల చవితి