తెలంగాణ

telangana

ETV Bharat / city

టీఎస్‌ బీపాస్ చట్టం అమలులో నిర్లక్ష్యం.. అధికారులపై సర్కారు కొరడా.. - ఆన్‌లైన్‌లో అనుమతి

TS BPASS : సులభతరంగా భవన నిర్మాణాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో అనుమతి ఇవ్వడంలో జాప్యం చేస్తున్న అధికారులకు ప్రభుత్వం జరిమానాలు విధించింది. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఫిర్జాదీగూడ, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌ సహా మేడ్చల్, ఆదిలాబాద్‌, మహబూబాబాద్, వనపర్తి మున్సిపాలిటీల్లో 10 మంది ఇంజినీర్లు, రెవెన్యూ ఉద్యోగులకు జరిమానాలు విధించింది.

Fines on Officers for negligence of TS B Pass Act in telangana
Fines on Officers for negligence of TS B Pass Act in telangana

By

Published : Mar 9, 2022, 9:02 AM IST

TS BPASS : రాష్ట్రంలో టీఎస్‌ బీపాస్ చట్టం- 2020 అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై సర్కారు కొరడా ఝుళిపించించింది. పలు జిల్లాల్లో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో సులభతరంగా భవన నిర్మాణాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో అనుమతి ఇవ్వడంలో జాప్యం చేస్తున్న అధికారులకు జరిమానాలు విధించింది. సకాలంలో దరఖాస్తులు పరిశీలించడంలో విఫలమైవుతున్నట్లు ప్రభుత్వం దృష్టి వచ్చిన నేపథ్యంలో.. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఫిర్జాదీగూడ, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌ సహా మేడ్చల్, ఆదిలాబాద్‌, మహబూబాబాద్, వనపర్తి మున్సిపాలిటీల్లో 10 మంది ఇంజినీర్లు, రెవెన్యూ ఉద్యోగులకు జరిమానాలు విధించింది.

వరంగల్ నగరపాలక సంస్థలో ఇరిగేషన్ ఏఈపీ శ్రీకాంత్‌కు 10 వేల రూపాయలు, ఫిర్జాదీగూడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి కె.రాజీవ్‌రెడ్డికి 10 వేల రూపాయలు, ఖమ్మం నగరపాలక సంస్థ ఇరిగేషన్‌ ఏఈ సీహెచ్‌ నరేష్‌కుమార్‌, మీర్‌పేట నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్‌ టీపీఓపీ దేవేందర్​కు 5 వేలు, ఆదిలాబాద్ పురపాలక సంఘం ఇరిగేషన్ ఏఈపీ వెంకటేశంకు 10 వేలు, తూముకుంట పురపాలక సంఘం రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ డి.కుమార్‌కు 5 వేల చొప్పున జరిమానాలు విధించింది.

టీఎస్‌ బీపాస్ చట్టం ప్రకారం భవనాల నిర్మాణాలకు సంబంధించి పౌరులు ఆన్‌లైన్‌లో చేసిన దరఖాస్తులు పరిష్కారంలో జాప్యం కలిగించే అధికారులకు జరిమానాలు విధించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి నగరపాలక సంస్థ, పురపాలక శాఖల్లో నిర్థేశిత గడువులోగా పౌరుల దరఖాస్తులు పరిష్కరించాలని... భవిష్యత్తులో ప్రక్రియ ఆలస్యం జరగకుండా టీఎస్‌ బీపాస్‌ కింద ఆమోదం ప్రక్రియను మరింత తరచుగా సమీక్షించాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details