తెలంగాణ

telangana

ETV Bharat / city

CPS Meeting: సీపీఎస్​పై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం - state finance ministry on cps issue

CPS Meeting: 'సీపీఎస్​ అంశంపై చర్చించుకుందాం రండి' అని ఉద్యోగ సంఘాలకు ఏపీ ఆర్థిక శాఖ ఆహ్వానం పంపింది. ఈ మేరకు ఏప్రిల్ 4వ తేదీన ఏపీ సచివాలయంలో సంప్రదింపుల సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ అధికారి తెలిపారు.

Finance Ministry Discuss on CPS
సీపీఎస్​పై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం

By

Published : Apr 1, 2022, 12:12 AM IST

CPS Meeting: సీపీఎస్ అంశంపై చర్చలకు రావాల్సిందిగా ఉద్యోగ సంఘాలను ఏపీ ఆర్థిక శాఖ ఆహ్వానించింది. ఏప్రిల్ 4వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఏపీ సచివాలయంలోని ఆర్థికశాఖ కాన్ఫ్​రెన్స్​ హాల్​లో సీపీఎస్​పై సంప్రదింపుల సమావేశాన్ని ఏర్పాటుచేసినట్టు ఆ శాఖ హెచ్ఆర్ విభాగం ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు.

ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్​లోని 16 ఉద్యోగ సంఘాలకు ఈ ఆహ్వానం పంపారు. ఉద్యోగ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు సీపీఎస్ అంశంపై చర్చలకు రావాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details