తెలంగాణ

telangana

ETV Bharat / city

Nirmala Seetharaman ON AP Revenue Deficit: 'ఉచిత పథకాల వల్లనే ఏపీలో రెవెన్యూ లోటు అధికం' - central finance minister nirmala seetharaman

Nirmala Seetharaman ON AP Revenue Deficit: ఏపీలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ రెవెన్యూ లోటు ఉన్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు ఈమేరకు ఆమె బదులిచ్చారు. ఏపీలో రెవెన్యూ లోటు ఊహించినదానికంటే ఎక్కువగానే ఉందని అన్నారు.

Nirmala Seetharaman ON AP Revenue Deficit: 'ఉచిత పథకాల వల్లనే ఏపీలో రెవెన్యూ లోటు అధికం'
Nirmala Seetharaman ON AP Revenue Deficit: 'ఉచిత పథకాల వల్లనే ఏపీలో రెవెన్యూ లోటు అధికం'

By

Published : Dec 15, 2021, 10:53 AM IST

Nirmala Seetharaman ON AP Revenue Deficit: రాష్ట్రంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆదాయాన్ని వాస్తవికంగా అంచనా వేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైనట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. రెవెన్యూ వ్యయాన్ని నియంత్రించలేకపోవడంతో 14వ ఆర్థిక సంఘం కాలావధి మొత్తంతో పాటు, 15వ ఆర్థిక సంఘం పరిధిలోని 2020-21లో రెవెన్యూ లోటు గ్రాంటు మంజూరు చేసినా ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటులో పెరుగుదల కనిపించినట్లు ఆమె పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు.

ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లేమి..

2015-16తో పోలిస్తే 2016-17లో రెవెన్యూ లోటు పెరగడానికి ప్రధాన కారణం ఉదయ్‌ స్కీం మార్గదర్శకాల ప్రకారం డిస్కంల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అందుకు ఖర్చు చేయడమేనన్నారు. 2019-20లో బడ్జెట్‌లో పేర్కొన్న రూ.1,779 కోట్లకు మించి రెవెన్యూ లోటు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, ఉచిత విద్యుత్తు లాంటి పథకాలేనని నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కూ వివిధ రూపాల్లో ఆర్థిక వనరులు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకు గత ఎనిమిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల వాటా కింద మొత్తం రూ.4,40,985 కోట్ల ఆర్థిక వనరులు అందించినట్లు ఆర్థికమంత్రి వివరించారు.

2014-15 నుంచి 2021-22వరకు కేంద్రం నుంచి ఏపీ రాష్ట్రానికి బదిలీ అయిన ఆర్థిక వనరులు ఇలా..

క్ర.సం వివరం రూ.కోట్లు
1. పన్నుల్లో వాటా 2,04,882
2. గ్రాంట్లు 2,22,010
3. రుణాలు, అడ్వాన్స్​లు 14,093
4. మొత్తం 4,40,985

ఆర్థిక సంఘాల అంచనాలు (రూ.కోట్లలో)

  • ఆరేళ్ల పన్ను ఆదాయ అంచనా
  • వాస్తవంగా వచ్చిన ఆదాయం

లోటు

4,00,698

3,06,583

94,115

  • పన్నేతర ఆదాయం అంచనా
  • వాస్తవంగా వచ్చింది

లోటు

76,043

24,947

51,096

  • ఆరేళ్ల రెవెన్యూ వ్యయం అంచనా
  • వాస్తవంగా జరిగిన రెవెన్యూ వ్యయం

పెరిగిన వ్యయం

7,10,594

7,52,413

41,819

  • ఆరేళ్ల వడ్డీ భారం అంచనా
  • వాస్తవ భారం

పెరిగిన వ్యయం

83,319

90,414

7,095

పింఛన్ల వ్యయం అంచనా

వాస్తవ వ్యయం

పెరిగిన భారం

83,235

87,530

4,295

పన్ను వాటా పెంచిన తర్వాత

రెవెన్యూలోటు అంచనా

వాస్తవంగా తలెత్తిన రెవెన్యూ లోటు

పెరిగిన రెవెన్యూ లోటు

28,009

1,15,951

87,942

ఇదీ చదవండి:

KCR Meet Stalin: కేంద్ర విధానాలపై కలిసి పోరాడాలని నిర్ణయం.. బలమైన కూటమి దిశగా అడుగులు..!

ABOUT THE AUTHOR

...view details