New Districts In AP: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీచేసింది. ఏప్రిల్ 4 తేదీ నుంచి కొత్త జిల్లాలు పరిపాలనా పరంగా కొత్త యూనిట్‌గా మార్పు చెందుతున్నట్టు పేర్కొంది. భౌగోళికంగా మార్పులు చేసిన అన్ని జిల్లాలకు ఏప్రిల్ 4 తేదీ అపాయింటెడ్ డే గా ఉంటుందని స్పష్టం చేసింది. మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ.. గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ప్రతి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లా కేంద్రాన్ని పేర్కొంటూ.. వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చారు. తుది నోటిఫికేషన్ ప్రకారం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్య ఇలా ఉన్నాయి.
1) జిల్లా : శ్రీకాకుళం
- జిల్లా కేంద్రం : శ్రీకాకుళం
- నియోజకవర్గాలు: 8 (ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
- రెవెన్యూ డివిజన్లు: టెక్కలి (14), శ్రీకాకుళం (16), కొత్తగా పలాస డివిజన్
- మొత్తం మండలాలు 30
- వైశాల్యం: 4,591 చ.కి.మీ
- జనాభా: 21.91 లక్షలు
2) జిల్లా పేరు: విజయనగరం
- జిల్లా కేంద్రం: విజయనగరం
- నియోజకవర్గాలు: 7 (రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట)
- రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి, విజయనగరం, చీపురుపల్లి
- మొత్తం మండలాలు: 27
- వైశాల్యం : 3,846 చ.కి.మీ
- జనాభా: 18.84 లక్షలు
3) జిల్లా పేరు: మన్యం
- జిల్లా కేంద్రం: పార్వతీపురం
- నియోజకవర్గాలు: 4 (పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు)
- రెవెన్యూ డివిజన్లు: పాలకొండ(6), పార్వతీపురం(8)
- మొత్తం మండలాలు: 14
- వైశాల్యం: 3,935 చ.కి.మీ
- జనాభా: 9.72 లక్షలు
4) జిల్లా పేరు: అల్లూరి సీతారామరాజు
- జిల్లా కేంద్రం: పాడేరు
- నియోజకవర్గాలు: 3 ( పాడేరు, అరకు, రంపచోడవరం )
- రెవెన్యూ డివిజన్లు: పాడేరు (11), రంపచోడవరం (11))
- మొత్తం మండలాలు: 22
- వైశాల్యం : 12,251 చ.కి.మీ
- జనాభా : 9.54 లక్షలు
5) జిల్లా పేరు: విశాఖపట్నం
- జిల్లా కేంద్రం: విశాఖపట్నం
- నియోజకవర్గాలు: 6 ( భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక)
- రెవెన్యూ డివిజన్లు: కొత్తగా భీమునిపట్నం (5), విశాఖపట్నం (6)
- మొత్తం మండలాలు: 11
- వైశాల్యం : 928 చ.కి.మీ
- జనాభా : 18.13 లక్షలు
6) జిల్లా పేరు: అనకాపల్లి
- జిల్లా కేంద్రం: అనకాపల్లి
- నియోజకవర్గాలు: 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి )
- రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం (10), అనకాపల్లి (14)
- మొత్తం మండలాలు: 24
- వైశాల్యం : 4,412 చ.కి.మీ,
- జనాభా : 18.73 లక్షలు
7) జిల్లా పేరు: కాకినాడ
- జిల్లా కేంద్రం: కాకినాడ
- నియోజకవర్గాలు: 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ నగరం)
- రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం (12), కాకినాడ (9)
- మొత్తం మండలాలు : 21
- వైశాల్యం : 2,605 చ.కి.మీ
- జనాభా : 19.37 లక్షలు
8) జిల్లా పేరు: కోనసీమ
- జిల్లా కేంద్రం: అమలాపురం
- నియోజకవర్గాలు: 7 (రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం )
- రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం, అమలాపురం, కొత్తగా కొత్తపేట
- మొత్తం మండలాలు: 22
- వైశాల్యం: 2,615 చ.కి.మీ
- జనాభా: 18.73 లక్షలు
9) జిల్లా పేరు: తూర్పుగోదావరి
- జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
- నియోజకవర్గాలు: 7 (అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం )
- రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం (10), కొవ్వూరు (9)
- మొత్తం మండలాలు: 19
- వైశాల్యం: 2,709 చ.కి.మీ
- జనాభా: 19.03 లక్షలు
10) జిల్లా పేరు: పశ్చిమ గోదావరి
- జిల్లా కేంద్రం: భీమవరం
- నియోజకవర్గాలు: 7 (ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు,తాడేపల్లిగూడెం)
- రెవెన్యూ డివిజన్లు: నరసాపురం (8), కొత్తగా భీమవరం (11)
- మొత్తం మండలాలు: 19
- వైశాల్యం: 2,178 చ.కి.మీ
- జనాభా: 17.80 లక్షలు
11) జిల్లా పేరు: ఏలూరు
- జిల్లా కేంద్రం: ఏలూరు
- నియోజకవర్గాలు: 7 (ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు)
- రెవెన్యూ డివిజన్లు: ఏలూరు (12), జంగారెడ్డిగూడెం (9), నూజివీడు (6)
- మొత్తం మండలాలు: 28
- వైశాల్యం: 6,413 చ.కి.మీ
- జనాభా: 20.03 లక్షలు
12) జిల్లా పేరు: కృష్ణా జిల్లా
- కేంద్రం: మచిలీపట్నం
- నియోజకవర్గాలు: 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ)
- రెవెన్యూ డివిజన్లు: గుడివాడ, మచిలీపట్నం, కొత్తగా ఉయ్యురు
- మొత్తం మండలాలు: 25
- వైశాల్యం: 3,775 చ.కి.మీ
- జనాభా: 17.35 లక్షలు
13) జిల్లా పేరు: ఎన్టీఆర్ జిల్లా
- జిల్లా కేంద్రం: విజయవాడ
- నియోజకవర్గాలు: 7 (విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు)
- రెవెన్యూ డివిజన్లు: విజయవాడ (6), కొత్తగా నందిగామ (7), కొత్తగా తిరువూరు (7)
- మొత్తం మండలాలు: 20
- వైశాల్యం: 3,316 చ.కి.మీ
- జనాభా: 22.19 లక్షలు