తెలంగాణ

telangana

ETV Bharat / city

సోషల్ మీడియాలో కేటీఆర్ హవా.. పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ - ktr birthday 2021

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్​ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు కేటీఆర్​కు బర్త్​డే విషెస్ తెలియజేస్తున్నారు. తెరాస కార్యకర్తలు మొక్కలు నాటి మంత్రిపై తమ ప్రేమను చాటుకుంటున్నారు.

ktr birth day
కేటీఆర్ బర్త్​డే

By

Published : Jul 24, 2021, 12:25 PM IST

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్​ జన్మదినం సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ట్విటర్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా బర్త్​ డే విషెస్ చెబుతున్నారు. తెరాస కార్యకర్తలు మొక్కలు నాటుతున్నారు. ట్విటర్​లో హ్యాపీ బర్త్​ డే కేటీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, హోంమంత్రి మహమూద్ అలీ ట్విటర్ వేదికగా కేటీఆర్​కు విషెస్ చెప్పారు. శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ కేటీఆర్‌కు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన పోచారం.. పార్టీలకతీతంగా మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మంత్రి కేటీఆర్​కు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. హరీశ్​రావు ట్వీట్​కు కేటీఆర్.. థాంక్యూ బావా అని రిప్లై ఇచ్చారు. కాలేరు వెంకటేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, హరిప్రియ వంటి పలువురు ఎమ్మెల్యేలు మంత్రికి బర్త్​డే విషెస్ తెలిపారు.

రాజకీయ ప్రముఖులే కాకుండా.. సినీ తారలు, దర్శకులు కూడా కేటీఆర్​కు శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాస్​మహారాజ రవితేజ, మంచు విష్ణు, చాక్లెట్ బాయ్ రామ్, కమెడియన్ వెన్నెల కిశోర్, బాలీవుడ్ స్టార్.. రియల్ హీరో సోనూసూద్, రంఘనాథన్ మాధవన్, డైరెక్టర్లు బాబీ, అనిల్ రావిపూడి వంటి పలువురు సినీ ప్రముఖులు కేటీఆర్​కు విష్ చేశారు.

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా మంత్రి కేటీఆర్​కు ట్విటర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీలు రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మంత్రికి విషెస్ చెప్పారు.

ఏపీకి చెందిన ఓ అభిమాని కేటీఆర్ చిన్నప్పటి చిత్రాన్ని.. ఇప్పటి చిత్రాన్ని పోస్ట్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు. దానికి స్పందిస్తూ.. అప్పటికీ.. ఇప్పటికీ ఏం మారలేదని రీట్వీట్ చేశారు.

" మీలాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నేటి తరానికి ఎంతో అవసరం. తెలంగాణకు మీరు చేస్తున్న సేవకు సెల్యూట్. మీరు ఇలాగే ప్రజల కోసం నిరంతరం పని చేయాల.. మీ విజన్​ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎంతగా అభిమానిస్తున్నారో మాకు తెలుసు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. ఈ సంవత్సరం మీకు ఎన్నో శుభాలు కలగాలి. ఎంజాయ్ యువర్ బర్త్ డే కేటీఆర్ "

- పలువురు సినీ ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details