తెలంగాణ

telangana

ETV Bharat / city

Jagapathi Babu : ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం - Ayurvedic treatment in Hyderabad

ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని సినీ నటుడు జగపతిబాబు అన్నారు. భారతీయ వైద్యవిధానంలో ఆయుర్వేదానికి చెక్కుచెరగని స్థానం ఉందని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్​లో ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్ ఆస్పత్రిని ప్రారంభించారు.

jagapathi babu, film actor jagapathi babu, jagapathi babu about herbal treatment
జగపతిబాబు, సినీ నటుడు జగపతిబాబు, ఆయుర్వేద వైద్యంపై జగపతిబాబు

By

Published : Jun 3, 2021, 3:04 PM IST

వెయ్యేళ్ల క్రితమే భారతీయ బుుషులు యోగా, ప్రాణాయమంతో కలిగే ప్రయోజనాలు గుర్తించారని సినీ నటుడు జగపతిబాబు అన్నారు. అత్యవసరమైతేనే అల్లోపతి వైద్య విధానాన్ని అనుసరించాలని సూచించారు. ప్రకృతి సిద్ధంగా వ్యాధులను నయం చేసే ఆయుర్వేద వైద్యంతో ఆరోగ్యం సొంతమవుతుందని చెప్పారు.

రోగాలను నయం చేయడంలో భారతీయ వైద్య విధానంలో ఆయుర్వేదం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్​లో ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్ ఆస్పత్రిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details