తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతున్న 15 రోజుల శిశువు మాయమైన ఘటన ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో జరిగింది. చినకొండేపూడికి చెందిన సుజాత 15 రోజుల క్రితం ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డతో పుట్టింట్లోనే ఉంటోంది. సుజాత రాత్రి బిడ్డను పక్కనే పెట్టుకుని నిద్రించింది. తెల్లవారుజామున మెలకువ వచ్చి చూసే సరికి పక్కనున్న బిడ్డ మాయమైంది. కంగుతిన్న కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై...తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు. సుజాత భర్త సతీష్ కూడా అదే గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుంటాడు. తెలిసిన వారే బిడ్డను మాయం చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాత్రంతా పక్కనే ఉంది... తెల్లవారే సరికి మాయమైంది..! - ఏపీ ముఖ్యవార్తలు
తల్లి పొత్తిళ్లలో అప్పటివరకు హాయిగా నిద్రిస్తున్న బిడ్డ ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. రాత్రి తన పక్కనే ఉన్న బుజ్జాయి తెల్లవారేసరికి మాయమైన ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగింది. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు విచారణ జరుపుతున్నారు.
![రాత్రంతా పక్కనే ఉంది... తెల్లవారే సరికి మాయమైంది..! fifteen days baby girl is missing in east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7678653-1108-7678653-1592548124097.jpg)
రాత్రంతా పక్కనే ఉంది... తెల్లవారే సరికి మాయమైంది..!