Field Assistants Arrested : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి వచ్చిన పది మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Field Assistants Arrested at Assembly : 14 ఏళ్లు ఫీల్డ్ అసిస్టెంట్లుగా పని చేసిన తమను ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక కుటుంబంతో సహా వీధినపడ్డామని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.