కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేలో సోమవారం ఒక్కరోజే.. 704 బృందాలతో 53,326 ఇళ్లలో సర్వే నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం 2,85,195 ఇళ్లలో సర్వే పూర్తి చేశారు. ప్రతి రోజు జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన బృందాలు ఇంటింటికి తిరిగి జ్వరం ఉన్నవారి సర్వేను నిర్వహిస్తున్నారు.
కరోనా వ్యాప్తి నివారణకు గ్రేటర్లో ఫీవర్ సర్వే - telangana news
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 2,85,195 ఇళ్లలో సర్వేపూర్తి చేశారు. సోమవారం రోజున 704 బృందాలతో 53,326 ఇళ్లలో సర్వే జరిపారు.
ఫీవర్ సర్వే, జీహెచ్ఎంసీ, గ్రేటర్లో ఫీవర్ సర్వే
ఒక్కో బృందంలో ఒక ఏ.ఎన్.ఎం, ఆశా వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్‌తో కూడిన సభ్యులు ఇంటింటికి తిరిగి జ్వరంతో ఉన్న వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు జ్వరం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది రసాయన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.
- ఇదీ చదవండిమూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు