రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం నివారణ చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఫీవర్ సర్వైలెన్స్కి శ్రీకారం చుట్టింది. జ్వరం వచ్చిన ప్రతి వారికి కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు.
జ్వరం వస్తే.. కరోనా పరీక్షలు చేయాల్సిందే - ఫీవర్ సర్వైలెన్స్
మీకు జలుబు చేసిందా.. జ్వరం కూడా వచ్చిందా? అయితే మీకు కరోనా పరీక్షలు చేయాల్సిందే. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికి పెరుగుతోన్న తరుణంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఫీవర్ సర్వైలెన్స్‌కు శ్రీకారం చుట్టింది. జ్వరం, జలుబు లక్షణాలు ఉన్నవారి వివరాల కోసం ఇంటింటికి సర్వే చేపట్టనుంది.
జ్వరం వచ్చిన ప్రతి వారికి కరోనా పరీక్షలు
ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు సహా.. అనుమానితులు ఉన్న ప్రాంతాల్లోనూ వ్యాప్తిని అదుపు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో కెమికల్స్‌ని పిచికారి చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు, జ్వరం జలుబు లక్షణాలు ఉన్నవారి వివరాల కోసం ఇంటిటి సర్వేని నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు