తెలంగాణ

telangana

ETV Bharat / city

"సెల్ఫీ విత్ ఫార్మర్, మై ఫార్మర్-మై సెలబ్రిటీ" - గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ, మనఊరు- మన బాధ్యత సంయుక్తంగా రైతు దినోత్సం

హైదరాబాద్ తార్నాకలో "గ్రామ భారతి స్వచ్ఛంద సంస్థ", "మన ఊరు-మన బాధ్యత" సంయుక్తంగా... జాతీయ రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ కుటుంబాలకు ఆత్మీయ సత్కారం చేశారు.

felicitation for organic farmers in national farmers day celebrations at tharnaka
"సెల్ఫీ విత్ ఫార్మర్, మై ఫార్మర్-మై సెలబ్రిటీ"

By

Published : Dec 23, 2020, 8:07 PM IST

ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లితే నేల ఆరోగ్యం, పర్యావరణం, మానవాళి ఆరోగ్యం కాపాడుకోవచ్చని పలువురు వ్యవసాయ నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ తార్నాకలో "గ్రామ భారతి స్వచ్ఛంద సంస్థ", "మన ఊరు-మన బాధ్యత" సంయుక్తంగా... జాతీయ రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి పలువురు అభ్యుదయ సేంద్రీయ రైతులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమాజానికి అమృతతుల్యమైన ఆహారం అందిస్తున్న ప్రకృతి వ్యవసాయ కుటుంబాలకు ఆత్మీయ సత్కారం చేశారు. అగ్రరాజ్యం అమెరికా సహా యావత్ ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న ప్రకృతి సేద్యానికి తోడ్పాటుగా ఉన్న సంస్థలు, వ్యక్తుల కృషిని అభినందిస్తూ సకుటుంబ సమేతంగా సత్కరించి, ప్రశంసాపత్రం అందజేశారు.

దేశానికి అన్నం పెడుతున్న అన్నదాత కృషి గుర్తిస్తూ... ఈ సందర్భంగా "సెల్ఫీ విత్ ఫార్మర్, మై ఫార్మర్-మై సెలబ్రిటీ" అనే నినాదం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం విస్తృతం చేయాలని ఆయా సంస్థలు సూచించాయి. విష రసాయన వ్యవసాయం వల్ల సంభవించే దుష్ఫలితాల నుంచి అధిగమించేందుకు ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయ పంటలే కాకుండా పండ్లు, కూరగాయల తోటలు సాగు చేస్తూ... సత్ఫలితాలు సాధిస్తున్నామని పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. 1996లో ఆవిర్భవించిన గ్రామ భారతి... మడి ఆధారంగా సుభాష్ పాలేకర్ పెట్టుబడి లేని వ్యవసాయ విధానంపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రకృతి వ్యవసాయం విస్తరణ దిశగా పనిచేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధి పలుస కరుణాకర్ ‌గౌడ్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:వ్యవసాయ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంది: వెంకయ్య

ABOUT THE AUTHOR

...view details