UGADI FESTIVAL: తెలుగునామ సంవత్సరం ఉగాదికి తీపి, పులుపుతో పాటు చేదును రుచి చూపించే వేపపూతను ఈసారి తినాలా వద్దా అని కొందరు సందేహిస్తున్నారు. గత ఆరునెలలుగా వేపచెట్లు తెగుళ్ల బారిన పడి ఎండిపోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటికి ఇప్పుడు వచ్చిన పూత తినడం ఆరోగ్యదాయకమేనా అనే అనుమానం పీడిస్తోంది. కానీ ప్రతీ ఒక్కరూ ఉగాది పచ్చడిలో వేపపూత కలిపి నిరభ్యంతరంగా తినొచ్చని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్ స్పష్టం చేశారు.
ఉగాదికి ఈసారి వేపపూత తినాలా..? వద్దా..? - ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం
UGADI FESTIVAL: ఉగాదికి తీపి, పులుపుతో పాటు చేదును రుచి చూపించే వేపపూతను ఈసారి తినాలా వద్దా అని కొందరు సందేహిస్తున్నారు. గత ఆరునెలలుగా వేపచెట్లు తెగుళ్ల బారిన పడి ఎండిపోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటికి ఇప్పుడు వచ్చిన పూత తినడం ఆరోగ్యదాయకమేనా అనే అనుమానం పీడిస్తోంది. అయితే ఇది చదవండి.
వేపచెట్టుకు వచ్చిన తెగులు తాత్కాలికమని, అది వేపపూతలో ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. వర్సిటీ శాస్త్రవేత్తలు ఆరునెలలుగా వేపచెట్లకొచ్చిన తెగుళ్లపై పరిశోధనలు చేశారు. ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్ ప్రాంత అడవుల నుంచి వ్యాపించిన వైరస్ వల్ల వేపచెట్లకు తెగులు సోకి చాలా ప్రాంతాల్లో ఎండిపోయాయి. కానీ మళ్లీ చాలా చెట్లకు పూర్తిస్థాయిలో చిగురు, పూత వచ్చాయి. తెగులు సోకిన చెట్ల పూత తింటే ఏమవుతుందోనన్న భయం అక్కరలేదని జగదీశ్వర్ చెప్పారు. వేపచెట్లు ఎక్కడ ఉన్నా సమీప ప్రాంతాల వారు నీరందించి కాపాడాలని సూచించారు.
ఇదీ చదవండి:TSRTC Ugadi Offer: ఉగాది సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్