తెలంగాణ

telangana

ETV Bharat / city

జేఎన్‌టీయూహెచ్‌లో మళ్లీ ఫీజుల మోత - తాజా విద్యా సమాచారం

JNTUH Fee Issue బీటెక్​ ఫీజులను జేఎన్​టీయూహెచ్​ వరుసగా రెండో ఏడాది భారీగా పెంచేసింది. గత ఏడాదికి నేటికి సగానికి పైగా రుసుమును పెంచింది. రెగ్యులర్​, సెల్ఫ్ ఫైనాన్స్​ కోర్సుల ఫీజులను పెంచి గుట్టుచప్పుడు కాకుండా ఉంచారు.

JNTUH Fee Issue
జేఎన్‌టీయూహెచ్‌లో మళ్లీ ఫీజుల మోత

By

Published : Aug 25, 2022, 10:24 AM IST

JNTUH Fee Issue : జేఎన్‌టీయూహెచ్‌ వరుసగా రెండో ఏడాది బీటెక్‌ ఫీజులను భారీగా పెంచేసింది. గతేడాదే రెగ్యులర్‌ బీటెక్‌ ఫీజును రూ.18 వేల నుంచి రూ.35 వేలకు పెంచిన వర్సిటీ ప్రస్తుత విద్యాసంవత్సరంలో దాన్ని రూ.50 వేలకు పెంచడం గమనార్హం. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల ఫీజును గతేడాది రూ.35 వేల నుంచి రూ.70 వేలకు పెంచగా ఇప్పుడు రూ.లక్షకు పెంచారు.

ఫీజుల పెంపుపై ఎలాంటి ప్రకటన చేయకుండా గుట్టుగా ఉంచడం గమనార్హం. జేఎన్‌టీయూహెచ్‌ హైదరాబాద్‌ ప్రాంగణంతోపాటు జగిత్యాల, మంథని, సుల్తాన్‌పూర్‌, సిరిసిల్ల, ఈ ఏడాది ప్రారంభమవుతున్న వనపర్తి కళాశాలల్లో చేరే విద్యార్థులకు ఈ ఫీజులు వర్తిస్తాయి. వాస్తవానికి 10 వేల లోపు ర్యాంకర్లకే వర్సిటీ కళాశాలల్లో సీట్లు వస్తుంటాయి. వారి పూర్తి బోధన రుసుము ప్రభుత్వమే చెల్లిస్తుంది.

అయితే వారి కుటుంబ ఆదాయం రూ.2 లక్షలు దాటితే బోధన రుసుము పొందేందుకు అనర్హులవుతారు. ఉదాహరణకు ఓ ప్రభుత్వ చిరుద్యోగి వార్షిక జీతం రూ.3 లక్షలు ఉంటే వారి పిల్లలకు ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ వర్తించదు. ఈ కళాశాలల్లో భర్తీ చేసే దాదాపు 2 వేల సీట్లలో అలాంటి వారు వందల మంది ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

త్వరలో ఓయూ సైతం..ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీటెక్‌ రెగ్యులర్‌ కోర్సు ఫీజు రూ.35 వేలు ఉండగా.. ఇక్కడ సైతం రూ.50 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒకటిరెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానంలో గత ఏడాది ప్రవేశపెట్టిన ఏఐ అండ్‌ ఎంఎల్‌ కోర్సుకు రూ.1.20 లక్షల ఫీజు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details