తెలంగాణ

telangana

ETV Bharat / city

Father's Day :నీ ప్రతిరూపం నేను.. నా ప్రతి అడుగులో నువ్వు

అమ్మలా నాన్న ప్రేమను చూపించలేడు... ముద్దు చేయలేడు... కానీ జీవితంలో ఏదైనా సాధించగలవనే ధైర్యాన్ని ఇవ్వగలడు. సొంతకాళ్లపై నిలబడగలిగే నమ్మకాన్ని ఇవ్వగలడు. అలాంటి నాన్నకు మనం ఏమి ఇవ్వగలం... ఆయన కోరుకున్న స్థానానికి చేరి ఆనందాన్ని కలిగించడం తప్ప.. అంతటి ఔన్నత్యమైన నాన్నను గౌరవించడం కోసం, ఆయన త్యాగాన్ని గుర్తించడం కోసం ప్రపంచవ్యాప్తంగా నేడు ఫాదర్స్ డే(Father's Day) జరుపుకుంటున్నారు.

father's day, father's day 2021, father's day story
ఫాదర్స్​డే, ఫాదర్స్​డే 2021, పితృదినోత్సవం, పితృదినోత్సవం 2021

By

Published : Jun 20, 2021, 7:34 AM IST

బుడిబుడి అడుగులు వేస్తూ పాకేటప్పుడు నడిపించే మత్స్యం అవుతావు... ఆటలాడుతూ కేరింతలు కొడుతుంటే చూసి మురిసిపోయే కూర్మం అవుతావు... భుజాల మీద ఎక్కించుకుని లోకాన్ని చూపిస్తూ వరాహం అవుతావు... అల్లరి చేస్తే కోపం నటించే నారసింహుడు అవుతావు... ఇష్టాలను తీర్చేందుకు ఇతరుల దగ్గర చేయి చాచే వామనుడు అవుతావు... ఎన్ని కష్టాలు వచ్చినా నరుక్కుంటూ వెళ్లే భార్గవుడు అవుతావు... జీవిత విలువల నడవడిక నేర్పే రాముడు అవుతావు... జీవిత యుద్ధపు మెళకువలు నేర్పే కృష్ణుడు అవుతావు... సత్యం, దయ, ధర్మం విలువలు నేర్పే బుద్ధుడు అవుతావు... పిల్లల రక్షణ కోరే కల్కి అవుతావు...

నీ ప్రేమ అమూర్తం

నీ త్యాగం అనిర్వచనీయం

నీ బాధ్యత అనంతం

నీ నడత సదా అనుసరణీయం

ABOUT THE AUTHOR

...view details