తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా కాటు: కుటుంబసభ్యుల ముందే ప్రాణాలొదిలిన ఇంటిపెద్ద - శ్రీకాకుళం వార్తలు

ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంపై కరోనా పగబట్టింది. వైరస్ సోకిన తండ్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఆ పేగుబంధం తల్లడిల్లింది. కళ్ల ముందే తండ్రిని వైరస్ కబళిస్తుంటే.. అతని కుమార్తె గుండెలవిసేలా రోధించింది. ఈ హృదయవిదారక ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కొయ్యనపేటలో జరిగింది.

కుటుంబసభ్యుల ముందే ప్రాణాలొదిలిన ఇంటిపెద్ద
కుటుంబసభ్యుల ముందే ప్రాణాలొదిలిన ఇంటిపెద్ద

By

Published : May 2, 2021, 11:58 PM IST

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జీ.సిగాడం మండలం కొయ్యనపేట గ్రామానికి చెందిన పంచరెడ్డి అసిరినాయడు కొంతకాలంగా విజయవాడలో నివాసముంటున్నాడు. అక్కడ కరోనా సోకగా... ఆదివారం రోజు అతడి స్వగ్రామం కొయ్యనపేటకు వచ్చాడు. అప్పటికే అసిరినాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.

ఆస్పత్రికి తరలిస్తుండగా... కుటుంబ సభ్యులు ముందే ప్రాణాలు విడిచాడు. కళ్లముందే ఇంటిపెద్ద తనువు చాలించడం చూసి ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదీ చదవండి:ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగని భూగర్భ డ్రైనేజీ నిర్మాణం

ABOUT THE AUTHOR

...view details