తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో జరిగిన ఓ వివాహానికి ఆ తండ్రి కుమారులు హాజరయ్యారు. తరువాత ఆరోగ్యం సరిగ్గా లేక ఇద్దరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరికీ కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. బాధితులిద్దరినీ అధికారులు ప్రత్యేక అంబులెన్స్‌లో కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. దేవస్థానం అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అప్రమత్తమయ్యారు. శ్రామిక్ రైల్లో మహారాష్ట్రకు వెళ్లి విధులు నిర్వర్తించి వచ్చిన ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌కి కరోనా సోకినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.
అన్నవరంలో వివాహానికి తండ్రీకొడుకులు.. ఇద్దరికీ కరోనా - latest corona update in annavaram
ఓ వివాహానికి హాజరైన తండ్రి, కుమారుడికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. బాధితులిద్దరూ అన్నవరంలో జరిగిన పెళ్లికి వెళ్లినట్లు తెలియగా... దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు.
కరోనా సోకిన తండ్రికొడుకులు..వివాహానికి హాజరు