తెలంగాణ

telangana

ETV Bharat / city

దిశ కేసులో ముందడుగు.. ఫాస్ట్‌ట్రాక్‌ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం - దిశ కేసులో ముందడుగు.. ఫాస్ట్‌ట్రాక్‌ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం

దిశ కేసులో ముందడుగు..  ఫాస్ట్‌ట్రాక్‌ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం
దిశ కేసులో ముందడుగు.. ఫాస్ట్‌ట్రాక్‌ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం

By

Published : Dec 4, 2019, 3:07 PM IST

Updated : Dec 4, 2019, 5:08 PM IST

15:05 December 04

జస్టిస్ ఫర్ దిశ కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం

శంషాబాద్‌ వద్ద హత్యాచారానికి గురైన 'దిశ' కేసులో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ కేసు విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. దీనిని అనుసరించి మహబూబ్ నగర్ మొదటి  అదనపు సెషన్స్, జిల్లా  న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ప్రకటిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకోనున్నారు. 

దిశ హత్యాచారం కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కేసు సత్వర విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇటీవల వరంగల్‌లో ఓ బాలిక హత్య ఘటనపై ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయడంతో.. 56 రోజుల్లోనే విచారణ పూర్తయి తీర్పు వెలువడింది. అదే తరహాలో ఈ కేసులోనూ సత్వర తీర్పు రావాల్సిన అవసరముందని భావించిన ప్రభుత్వం.. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు హైకోర్టుకు ప్రతిపాదనలు పంపింది. తాజాగా ఆ ప్రతిపాదనకు ఉన్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది.

Last Updated : Dec 4, 2019, 5:08 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details