తెలంగాణ

telangana

ETV Bharat / city

సమరావతి : 26వ రోజుకు రాజధాని రైతుల నిరసన - రాజధాని రైతుల నిరసన

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో పోలీసుల అణచివేత ధోరణిని లెక్కచేయకుండా అమరావతి కోసం ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. అమరావతి కోసం ప్రాణాలు వదిలేందుకైనా సిద్ధమని అన్నదాతలు తేల్చిచెబుతున్నారు. నిన్నటి పర్యటన వాయిదాపడడంతో నేడు జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధిలు అమరావతిలో పర్యటించనున్నారు. వారికి అన్ని ఆధారాలు అందచేసేందుకు మహిళలు సిద్ధమయ్యారు.

సమరావతి : 26వ రోజుకు రాజధాని రైతుల నిరసన
సమరావతి : 26వ రోజుకు రాజధాని రైతుల నిరసన

By

Published : Jan 12, 2020, 7:45 AM IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో రాజధాని రైతుల పోరు 26వరోజుకు చేరింది. ఆందోళన ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో రాజధాని గ్రామాల్లో పోలీసులను భారీగా మోహరించారు. ఎవరూ బయటకు రావొద్దంటూ నిబంధనలను కఠినతరం చేశారు. అయితే మహిళలు, రైతులు మాత్రం తమ ఇళ్ల వద్ద, ఆలయాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. దేవాలయానికి వెళ్లే వారిని కూడా పోలీసులు అడ్డుకుంటుండటంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధులు ఇవాళ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుండటంతో పోలీసుల నిర్బంధపై వారికి ముందు ఆధారాలు పెట్టాలని మహిళలు నిర్ణయించారు.

సమరావతి : 26వ రోజుకు రాజధాని రైతుల నిరసన

రైతుల్ని అరెస్ట్‌ చేసేందుకు పలుచోట్ల పోలీసులు ఇళ్లలోకి చోరబడటం.. ఉద్రిక్తత దారితీసింది. రహదారి దిగ్బంధం కేసులో ఉన్నారంటూ వెలగపూడిలోని ఓ ఇంట్లోకి పోలీసులు చొరబడ్డారు. ఇంటి తలుపులు పగలకొట్టే ప్రయత్నం చేశారు. మహిళలు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెనుతిరిగారు.

అరెస్టులను లెక్క చేయమని రైతులు తెగేసి చెప్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 15మంది చనిపోయారని...ఎన్ని ప్రాణాలు పోయినా ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చిచెప్తున్నారు.ఇవాళ కూడా మందడం, తుళ్లూరుల్లో మహాధర్నాలు కొనసాగనున్నాయి. పోలీసులు అడ్డుకుంటే ఇళ్లు, ఆలయాల వద్దే నిరసనలు కొనసాగించనున్నారు.

ఇదీచదవండి

నేటితో 'పల్లె ప్రగతి 2.o' ముగింపు

ABOUT THE AUTHOR

...view details