రాజధాని వికేంద్రీకరణ నిరసిస్తూ అమరావతిలో రైతులు ఆందోళన కొనసాగుతోంది. ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేసి... రాష్ట్రపతి పాలన విధించాలని రైతులు డిమాండ్ చేశారు. రాజధానికి వికేంద్రీకరణ వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని అన్నదాతలు తెలిపారు. అమరావతి ఇక్కడ అభివృద్ధి చేయకపోతే తమ భూములను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. 2015లో ఎలాగైతే భూములు ఇచ్చామో... తిరిగి అలాగే తమకు అప్పగించాలని కోరారు.
అమరావతిలో రైతుల ఆందోళన తీవ్రతరం
ఏపీలో రాజధాని వికేంద్రీకరణను నిరసిస్తూ అమరావతిలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వైకాపా ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేసి... రాష్ట్రపతి పాలన విధించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు.
అమరావతిలో రైతుల ఆందోళన తీవ్రతరం