రాష్ట్రంలో రైతుల మరణాలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. గతేడాది రోజుకు సగటున 48 మంది కన్నుమూయగా ఈ ఏడాది 36 మంది మరణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్లలోపు రైతుల కోసం రైతు జీవిత బీమా పథకాన్ని వ్యవసాయ శాఖ అమలుచేస్తోంది. ఈ పథకం కింద నమోదైన రైతుల తరఫున ప్రీమియం సొమ్మును ఎల్‌ఐసీకి చెల్లిస్తోంది. రైతు ఏ కారణంతో కన్నుమూసినా అతని నామినీకి 10 రోజుల్లోగా రూ.5 లక్షల పరిహారాన్ని సంస్థ అందజేయాలనే నిబంధన ఉంది.
తగ్గిన రైతు మరణాలు! రైతు బీమా పథకంలో వెల్లడి - రైతు బీమా పథకం
రాష్ట్రంలో అన్నదాతల మరణాలు తగ్గాయి. గతేడాది సగటున 48 మంది మరణించగా... ఈ ఏడాది 36 మంది మృతిచెందినట్లు రైతు జీవిత బీమా పథకం పరిహారంలో వెల్లడైంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 28,480 మంది రైతులు మరణించారు.
FARMER
ఈ పథకాన్ని 2018 ఆగస్టు 14న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలి ఏడాది 2019 ఆగస్టు 13న ముగిసింది. ఆ ఏడాదిలో మొత్తం 17,519 మంది రైతులు కన్నుమూశారని ఎల్‌ఐసీ వెల్లడించింది. ఈ ఏడాది (2019 ఆగస్టు 14 నుంచి 2020 ఆగస్టు 13)లో ఈనెల 10 వరకూ 10,961 మంది కన్నుమూశారు. మొత్తం 665 రోజులకు 28,480 మంది రైతులు కన్నుమూయడంతో వారి కుటుంబాలకు రూ.1424 కోట్ల పరిహారాన్ని అందజేసినట్లు ఎల్‌ఐసీ వ్యవసాయశాఖకు నివేదించింది.