విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మార్కెట్‌కు పరిసర ప్రాంతాల నుంచి రైతులు వంకాయలు తీసుకొచ్చారు. సరకు ఒక్కసారిగా మార్కెట్‌కు చేరుకోగా.. ధరలు పతనమయ్యాయి. కనీసం కోతలకు పెట్టిన డబ్బులు కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 25 కేజీల ట్రేను రూ.50కు అడుగుతున్నారని వాపోయారు. ఆగ్రహానికి గురైన అన్నదాతలు వంకాయలను రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.
గిట్టుబాటు ధర లేక పంటను పారబోసిన రైతులు
లాక్డౌన్ నిబంధన ఆంధ్రా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌కు తీసుకొచ్చిన వంకాయలకు గిట్టుబాటు ధర లేక పారబోసిన సంఘటన విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో జరిగింది.
గిట్టుబాటు ధర లేక పంటను పారబోసిన రైతులు