మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు... తెలుగు వారి సత్తా ఏంటో నిరూపించారని శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో మాదాపూర్ చిత్రమయీ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో... 'మెనీ ఫేసెస్ ఆఫ్ ఏ మాస్టర్' పేరుతో నిర్వహించిన ఫొటో ప్రదర్శనను స్పీకర్ ప్రారంభించారు.
పీవీ ఫొటో ప్రదర్శన.. 'మెనీ ఫేసెస్ ఆఫ్ ఏ మాస్టర్' - many faces of a master
తెలంగాణ ప్రభుత్వం శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో మాదాపూర్ చిత్రమయీ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో... 'మెనీ ఫేసెస్ ఆఫ్ ఏ మాస్టర్' పేరుతో ఫొటో ప్రదర్శన నిర్వహించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై... ప్రదర్శనను ప్రారంభించారు.
![పీవీ ఫొటో ప్రదర్శన.. 'మెనీ ఫేసెస్ ఆఫ్ ఏ మాస్టర్' farmer prime minister pv narasaimha rao photo expo in madhapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10547832-thumbnail-3x2-pv.jpg)
పీవీ ఫొటో ప్రదర్శన.. 'మేనీ ఫేసెస్ ఆఫ్ ఏ మాస్టర్'
సంస్కరణలతో దేశాన్ని పాలించి... ప్రజలకు సత్ఫలితాలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశానికి స్ఫూర్తిదాయకమైన పాలన అందించిన పీవీ... వ్యక్తి కాదు ఆయనో శక్తి అని వ్యాఖ్యానించారు. పీవీపై ఓ పుస్తకం తీసుకురావాలని అనుకుంటున్నట్టు... ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పీవీ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.