తెలంగాణ

telangana

ETV Bharat / city

మంత్రి ఈటలను కలిసిన మాజీ మంత్రి గీతారెడ్డి.. - Telangana minister etela rajender

యునాని, ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్స చేసేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని మాజీ మంత్రి గీతారెడ్డి కోరారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

Telangana health minister etela rajender
మంత్రి ఈటలను కలిసిన మాజీ మంత్రి గీతారెడ్డి.

By

Published : Dec 12, 2020, 3:51 PM IST

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ను మాజీ మంత్రి గీతారెడ్డి కలిశారు. యునాని, ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేసేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని కోరారు. యునాని, ఆయుర్వేద, సిద్ధ వంటి ప్రాచీన వైద్య విధానాలను అధునాతన వైద్య విధానం అలోపతితో కలపడం సరైంది కాదని గీతారెడ్డి పేర్కొన్నారు.

బూర్గుల రామకృష్ణారావు భవన్​లో మంత్రి ఈటలను కలిసి వినతిపత్రం సమర్పించిన గీతారెడ్డి.. ఈ నోటిఫికేషన్​ను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి ఈటలను గీతారెడ్డి కోరారు.

ABOUT THE AUTHOR

...view details