కడప జిల్లా మైలవరం మండలం చిన్న వెంతుర్ల గ్రామంలో ట్రాక్టర్ సహాయంతో ఓ రైతు వ్యవసాయ పనులు చేస్తున్నాడు . వరి పొలంలో పనులు చేస్తున్న క్రమంలో ఆ ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది. చుట్టుపక్కల రైతులు పిలిపించి పైకి లాగేందుకు ప్రయత్నించారు . ఈ క్రమంలో ముందుకు వెనక్కు తిప్పుతుండగా హఠాత్తుగా బోల్తా పడింది. దాని కింద పడి రైతు దుర్మరణం పాలయ్యాడు. బయటకు లాగే ప్రయత్నం చేసినా... అప్పటికే మృతి చెందాడని స్థానిక రైతులు తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
లైవ్ వీడియో: ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి - కడప జిల్లాలో ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి
ఏపీలోని కడప జిల్లా మైలవరం మండలంలో ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి చెందాడు. వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో రైతు దాని కింద పడి ఊపిరాడక మృతి చెందాడని స్థానికులు తెలిపారు.

లైవ్ వీడియో: ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి
లైవ్ వీడియో: ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి