లాక్‌డౌన్ పొడిగింపుతో ప్రజలు ఇబ్బందులు పడకూడదని సీఎం సూచించినట్లు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర రెడ్డి తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్‌లో సివిల్ సప్లయ్, అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హజరయ్యారు. 500 మంది ఆటో, వలస కార్మికులకు రోజు వారి సరుకులు అందజేశారు.
ఆటో, వలస కార్మికులకు నిత్యావసరాల పంపిణి - ఉప్పల్ నియోజకవర్గ వార్తలు
ఉప్పల్ నియోజకవర్గంలో సివిల్ సప్లయ్, అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణి నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆటో, వలస కార్మికులకు నిత్యావసరాల పంపిణి
అమాలి వర్కర్స్ తరపున సీఎం సహయ నిధికి రూ.2లక్షల విరాళాన్ని మంత్రి కేటీఆర్‌కు అందించడాన్ని నేతలు అభినందించారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తిగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు.