టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అభిమానుల శుభాకాంక్షల వెల్లువ - TPCC President Revanth Reddy latest news
11:28 June 27
రేవంత్‌రెడ్డి ఇంట... కార్యకర్తలు, అభిమానుల కోలాహలం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేవంత్ అభిమానులు... హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తరలివస్తున్నారు. తమ అభిమాన నేతకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కార్యకర్తలు, అభిమానులతో రేవంత్ నివాసం కోలాహలంగా మారింది.
తన కోసం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలను రేవంత్‌రెడ్డి కలుసుకున్నారు. అభిమానంతో తెలుపుతున్న శుభాకాంక్షలను చిరునవ్వుతో స్వీకరించారు. పలువురు కార్యకర్తలు వివరిస్తున్న సమస్యలను ఓపిగ్గా విన్నారు. అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకుందామని భరోసా ఇచ్చారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉండి... కార్యకర్తలందరికి అండగా ఉంటానని రేవంత్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు, అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞున్ని అని టీపీసీసీ నూతన అధ్యక్షుడు తెలిపారు.