తెలంగాణ

telangana

ETV Bharat / city

పది ఫాన్సీ నంబర్ల వేలం.. ఆదాయం ఎంతో తెలుసా..? - పది ఫాన్సీ నెంబర్ల వేలం.. ఆదాయం ఎంతో తెలుసా..?

ఖైరతాబాద్​ ఆర్టీఏకు కాసుల వర్షం కురిసింది. ఫాన్సీ నంబర్ల వేలంలో రూ.11.95 లక్షల ఆదాయం సమకూరింది. అత్యధికంగా టీఎస్​11ఈఆర్​9999 నంబర్​తో రూ.4,81,000 ఆదాయం వచ్చింది.

పది ఫాన్సీ నెంబర్ల వేలం.. ఆదాయం ఎంతో తెలుసా..?

By

Published : Nov 16, 2019, 11:45 PM IST

ఫ్యాన్సీ నంబర్లు రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో రవాణేతర వాహనాల ఫ్యాన్సీ నంబర్లతో శనివారం ఒక్కరోజే లక్షల్లో ఆదాయం సమకూరింది. మొత్తం పది నంబర్లకు రూ.11,95,146 ఆదాయం వచ్చింది. అత్యధికంగా టీఎస్​11ఈఆర్​9999 నంబర్ తో రూ.4,81,000 ఆదాయం వచ్చింది. అత్యల్పంగా టీఎస్​11ఈఎస్​0018 నంబర్​కు రూ.13,025 ఆదాయం వచ్చిందని రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు.

టీఎస్​11ఈఆర్​9909 నంబర్​కు రూ.35,000లు, టీఎస్​11ఈఆర్​9999 కు రూ. 4,81,000లు, టీఎస్​11ఈఎస్​0001 కు రూ.3,00,260లు, టీఎస్​11ఈఎస్​0004 కు రూ.21,425లు, టీఎస్​11ఈఎస్​0005 కు రూ.31,000లు, టీఎస్​11ఈఎస్​0007 కు రూ.1,16,000లు, టీఎస్​11ఈఎస్​0009 కు రూ.1,01,000లు, టీఎస్11ఈఎస్​0011 కు రూ.65,400లు, టీఎస్​11ఈఎస్​0012 కు రూ.31,036లు, టీఎస్​11ఈఎస్​0018 కు రూ.13,025లు వచ్చాయని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి:పబ్బుకి వెళ్లారు... మద్యం తాగారు... క్రేన్​ను ఢీకొట్టారు...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details