స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు కేరళలో కూడా చాలా మంది అభిమానులున్నారు. అల్లు అర్జున్ సినిమాలకు మలయాళంలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కేరళలో మల్లు అర్జున్ అని పిలిపించుకునే క్రేజ్ అల్లు అర్జున్ సొంతం. తాజాగా అల్లు అర్జున్‌కు ఆయన కేరళ అభిమాని ఓ అరుదైన బహుమతి అందించారు.
కేరళలో పుట్టి పెరిగి దుబయ్‌లో సెటిలైన మల్టీ మిలియనీర్ రియాజ్ కిల్టన్ ఇటీవల యూఏఈలో అల్లు అర్జున్ను కలిశారు. అల్లు అర్జున్‌కు 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్‌ను బహుమానంగా ఇచ్చారు. అరుదైన గిఫ్ట్ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విషయాన్ని తాను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తనకు ఈ గిఫ్ట్ ఇస్తున్నప్పటి వీడియోతో పాటు ఆ పిస్టల్ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ... తన అభిమాన హీరోకు బహుమతి ఇవ్వటం చాలా ఆనందంగా ఉందని తెలియచేసారు రియాజ్.