Director Sukumar : ప్రముఖ దర్శకుడు సుకుమార్‌పై ఓ అభిమాని వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. దూరదర్శిని చిత్రంలో కథానాయకుడిగా నటించిన సువీక్షిత్ బొజ్జా సుకుమార్‌కు వీరాభిమాని. ఇటీవల పుష్ప చిత్రంతో దేశం గర్వించదిగిన దర్శకుల్లో ఒకరిని నిలిచిన సుకుమార్‌పై ప్రేమతో తన అభిమానాన్ని చాటుకునేందుకు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. తన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడన జిల్లా బోరెడ్డిగారి గ్రామంలో రెండున్నర ఎకరాల భూమిలో వరి పంటతో సుకుమార్ రూపం వచ్చేలా సాగు చేశాడు.
Director Sukumar: సుకుమార్‌పై అభిమానం... 'పంట పండింది'... - సినీ దర్శకుడు సుకుమార్
Director Sukumar : ప్రముఖ దర్శకుడు సుకుమార్‌పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు ఆయన విరాభిమాని. తన సొంత పొలంలో వరి నారుతో సుకుమార్ రూపం వచ్చేలా సాగు చేశాడు.
Director Sukumar
దాదాపు 50 రోజులపాటు శ్రమించి ఆ రూపాన్ని తీసుకొచ్చాడు. సుకుమార్ తోపాటు పుష్ప-2 పేరు కూడా సాగు చేయడం మరింత ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించి వీడియోను దర్శకుడు సుకుమార్‌కు చూపించి సువీక్షిత్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. సువీక్షిత్ చూపిన అభిమానానికి దర్శకుడు సుకుమార్ కళ్లు చెమ్మగిల్లాయి.
ఇదీ చదవండి :Canara Bank Cheating: కెనరా బ్యాంకు అధికారుల మోసం...రుణాలిచ్చి బురిడి కొట్టించారు -బాధితులు