తెలంగాణ

telangana

ETV Bharat / city

'పొగబండి'కి జలగండం.. 118 ఏళ్ల చరిత్రకు సమాధి! - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

కడప జిల్లాలో ఉన్న ఈ స్తూపం 118 ఏళ్ల కిందటిది. ఓ ఘోర ప్రమాదానికి గుర్తు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ స్తూపం ప్రస్తుతం గండికోట వెనుక జలాల్లో ముంపునకు గురైంది.

Stupa
118 ఏళ్ల కిందటి పొగ బండి స్తూపానికి జలగండం..

By

Published : Jan 22, 2021, 4:31 PM IST

భారతదేశాన్ని బ్రిటీష్‌ వారు పరిపాలిస్తున్న సమయంలో మద్రాసు నుంచి ముంబయికి ‘మెయిల్‌’ రైలు ప్రయాణికులతో బయలుదేరింది. 1902 సంవత్సరం సెప్టెంబరు 12వ తేదీన కడప జిల్లా మంగపట్నం రైల్వేస్టేషన్‌కు చేరింది. ఆ సమయంలో జోరుగా వర్షం పడుతోంది. వరద నీటిలో మంగపట్నం సమీపంలోని రైల్వే వంతెన కొట్టుకుపోయింది. అదే దారిలో వచ్చిన రైలు ప్రమాదానికి గురైంది. పది మంది యూరోపియన్లు, 61 మంది హిందువులు, ముస్లింలు మృతిచెందారు. ప్రమాద ప్రాంతంలోనే వారిని ఖననం చేసి ఈ స్తూపాన్ని నిర్మించారు.

ఈ ప్రమాదంలో ఆంగ్లో-ఇండియన్‌ థెరిస్సా లీమా సిస్టర్‌ ప్రాణాలు కోల్పోయారు. ఆమె బెంగళూరులో కార్మెలైట్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ థెరిస్సా (సీఎస్‌ఎస్‌టీ) సంస్థ అధిపతి. ఈ సంస్థ ఆధ్వర్యంలో భారత్‌లో సుమారు 115 పాఠశాలలు నడుస్తున్నాయి. ఆమె జ్ఞాపకార్థం 2003లో మంగపట్నం వద్ద ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా సెప్టెంబరు 12న స్తూపం వద్ద అంజలి ఘటించేవారు. గండికోట జలాల్లో ఈ స్తూపం మునగడంతో పాఠశాల యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది. స్తూపాన్ని సంరక్షించాలని కోరుతోంది.

ఇదీ చదవండీ:తుది అంకానికి యాదాద్రి పనులు.. త్వరలోనే పునః ప్రారంభం!

ABOUT THE AUTHOR

...view details