తెలంగాణ

telangana

ETV Bharat / city

Gorati meet CJI: సీజేఐని కలిసిన గోరటి వెంకన్న.. - సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన గోరటి వెంకన్న

Gorati meet CJI: ప్రముఖ కవి గోరటి వెంకన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన వెంకన్నను సీజేఐ అభినందించారు. అనంతరం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య ఆకాడమీ అవార్డు అందుకున్నారు.

goreti meet cji
సీజేఐని కలిసిన గోరటి వెంకన్న

By

Published : Mar 11, 2022, 8:22 PM IST

Gorati meet CJI: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను ప్రముఖ కవి గోరటి వెంకన్న మర్యాద పూర్వకంగా కలిశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా సీజేఐని కలిశారు. వల్లంకి తాళం కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది.

సీజేఐని కలిసిన గోరటి వెంకన్న

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన గోరటిని సీజేఐ అభినందించారు. శాలువాతో సత్కరించారు. సీజేఐకి వల్లంకి తాళం కవితా సంపుటిని గొరటి వెంకన్న బహుకరించారు. సీజేఐ అభ్యర్థన మేరకు అడవి తల్లిపై పాట పాడి వినిపించారు.

సీజేఐని కలిసిన గోరటి వెంకన్న

ఇవాళ సాయంత్రం దిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అవార్డు ప్రదానం చేశారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details