'కశ్మీరీలకు ఇప్పుడు అసలైన నాయకత్వమే లేదు' - sanjay kak on article 370 cancellation
ఆర్టికల్ 370 రద్దును భాజపా అసాధారణ నిర్ణయంగా ప్రచారం చేసుకుంటోందని ప్రముఖ రచయిత, ఫిల్మ్ మేకర్ సంజయ్ కాక్ అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ప్రజలకు ఇప్పుడు నాయకత్వమే లేకుండా పోయిందన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత... జమ్మూకశ్మీర్ ప్రజలు స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయని ప్రముఖ రచయిత, ఫిల్మ్ మేకర్ సంజయ్ కాక్ అన్నారు. హైదరాబాద్‌లో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో బాలగోపాల్ పదో స్మారక సదస్సుకు సఫాయి కర్మచారి ఆందోళన్ నేత బెజవాడ విల్సన్‌తో పాటు పాల్గొన్నారు. ఐక్య రాజ్యసమితి లో ప్రధాని నరేంద్రమోదీ భారత్‌లో బహిరంగ మల విసర్జన లేదని చెప్పడం సిగ్గు చేటని సఫాయి కర్మచారి ఆందోళన్ నేత బెజవాడ విల్సన్ మండిపడ్డారు. భారత దేశంలో దారిద్య్రం లేని, ఆర్థిక ప్రగతి సాధించినట్లుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. దశాబ్దాలు గడుస్తున్నా మనుష్యులు మలాన్ని ఎత్తివేయడం మారడంలేదని....పరిస్థితుల్లో మార్పు ఎప్పుడు వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : ఆర్టికల్ 370పై విపక్షాలకు మోదీ సవాల్