Huge donation to TTD: నిత్యం వేలాది భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలే కాకుండా బయట నుంచి వచ్చే విరాళాలు సైతం ఎక్కువగా ఉంటాయి. ఆ వడ్డీకాసుల వాడికిి ఎంత మెుత్తంలో విరాళాలు ఇచ్చిన ఆ శ్రీనివాసుని సరిపోతాయా! తన కోర్కెలు తీర్చే కోదండరాయుడిని చెన్నై వాస్తవ్యలు భారీ విరాళం ప్రకటించారు.
తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించిన ముస్లిం కుటుంబం.. - ఏపీ తాజా వార్తలు
Huge donation to TTD: ఏపీలోని తిరుమల శ్రీవారికి భారీ విరాళం వచ్చింది. ఆ విరాళం ముస్లిం కుటుంబం నుంచి రావడం విశేషం. చెన్నైకి చెందిన సుబీనాబాను, అబ్దుల్ ఘనీ దంపతులు శ్రీవారికి రూ.1.02 కోట్లు విరాళం అందజేశారు.
శ్రీవారికి చెన్నైకి చెందిన సుబీనా బాను, అబ్దుల్ ఘనీ దంపతులు తమ పిల్లలతో కలిసి మంగళవారం రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాతలు విరాళం చెక్కును తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు, ఇటీవల తిరుమలలో ఆధునికీకరించిన శ్రీపద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నీచర్, వంటశాలలో పాత్రలకు రూ.87 లక్షలు విరాళంగా అందజేశారు. అంతకుముందు ఈ దంపతులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఇవీ చదవండి: