ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమి ఎంఐ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను రూపొదించి ఓ వ్యక్తిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి మొబైల్ కొనుగోలు చేసేందుకు అంతర్జాలంలో వెతికాడు. అందులో అచ్చం షావోమి ఎంఐ సంస్థను పోలిన ఓ వెబ్‌సైట్‌ను తెరిచి, మొబైల్ బుక్ చేసి, రూ. 18వేలు చెల్లించాడు. ఆర్డర్ ఇంకా రాలేదని వెబ్సైట్లో ఉన్న నెంబర్‌కు ఫోన్ చేస్తే.. ఆ నెంబరు పని చేయడం లేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.
నకిలీ ఎంఐ వెబ్‌సైట్‌తో మోసం - Fake Website Cheating
ప్రముఖ మొబైల్ కంపెనీకి చెందిన నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించి ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన జూబ్లీహిల్స్‌లో జరిగింది.

నకిలీ వెబ్‌సైట్‌తో మోసం