తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో నకిలీ ఎరువుల కుంభకోణం.. ఏపీలో దర్యాప్తు! - తెలంగాణలో నకిలీ ఎరువులు

Fake Fertilisers case: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసరాల్లో కలకలం రేపిన నకిలీ ఎరువుల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా ఇవాళ ఏపీకి వెళ్లిన తెలంగాణ అధికారులు విజయవాడ శివారు ప్రాంతాల్లో విచారణ చేపట్టారు.

Fake Fertilisers case
ఖమ్మం జిల్లాలో నకిలీ ఎరువుల కుంభకోణం

By

Published : May 11, 2022, 6:07 PM IST

Fake Fertilisers case: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసరాల్లో ఇటీవల కలకలం రేపిన కల్తీ పొటాష్‌ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. ఇసుక రంగుమార్చి పొటాష్‌గా విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఇవాళ ఏపీకి వెళ్లిన తెలంగాణ పోలీసు, వ్యవసాయశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విజయవాడ శివారు నున్నలోని హేమ బయోటెక్, ఇతర ఆగ్రో పరిశ్రమలను పరిశీలించారు. పరిశ్రమ నిర్వాహకుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు.

ఇవీ చూడండి :రాష్ట్రంలో విస్తారంగా పెంచిన ఆ మొక్కలపై నిషేధం.. అవి అంత డేంజరా..?

ABOUT THE AUTHOR

...view details