ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగ యువతులను మోసం చేసిన... ఘరానా మోసగాడిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి నకిలీ నియామక పత్రాలు, రూ. 35 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ బంజారానగర్‌కు చెందిన భూక్య మణికంఠ... తాను జెన్‌ప్యాక్ట్ సంస్థలో మానవవనరుల అధికారిగా పనిచేస్తున్నానంటూ చెప్పి సామాజిక మాధ్యమాల్లో... ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాడు.
ఉద్యోగాల పేరుతో మోసాలు.. పోలీసుల అదుపులో నిందితుడు
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌కు చెందిన భూక్య మణికంఠను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలిపిస్తానంటూ నిరుద్యోగ యువతులను నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు.
ఉద్యోగాల పేరుతో మోసాలు.. పోలీసుల అదుపులో నిందితుడు
అతని మాటలు నమ్మిన పలువురు పెద్ద ఎత్తున దరఖాస్తులు పంపించారు. ప్రధానంగా యువతులను లక్ష్యంగా చేసుకొని ఒక్కొక్కరి నుంచి రూ. 5 వేల చొప్పున సుమారు వంద మంది నుంచి వసూలు చేశారు. కొందరికి సంస్థలో ఉద్యోగం పొందినట్టు నకిలీ నియామక పత్రాలు కూడా ఇచ్చాడు. బాధితులు నియామక పత్రాలు తీసుకొని సంస్థకు వెళ్లగా అవి నకిలీవని తేలింది. తాము మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా... విచారణ చేపట్టిన పోలీసులు మోసగాడిని అరెస్టు చేశారు.