రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ పరిధిలో నకిలీ ధ్రువపత్రాలతో స్థలాలను విక్రయించే ముఠా సభ్యులను హయత్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద అంబర్‌పేట్‌లోని సర్వే సంఖ్య 654లోని ఫ్లాట్ నంబర్ 105, 106లను నకిలీ పత్రాలతో విక్రయించినట్లు సత్యదేవి అనే మహిళ హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హరిహరకుమార్, ప్రేమ్‌కుమార్, రేపాక కరుణాకర్లను అరెస్టు చేశారు. వీరిపై సుల్తాన్ బజార్ పోలీస్‌స్టేషన్‌లో నకిలీ ధ్రువపత్రాల తయారీ కేసు, చౌటుప్పల్ పీఎస్‌లో నాలుగు చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి పలు నకిలీ పత్రాలు, రబ్బరు స్టాంపులు, నకిలీ గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ పత్రాలతో స్థలాలు విక్రయించే ముఠా అరెస్ట్ - land selling on fake documents
నకిలీ పత్రాలతో స్థలాలను విక్రయించే ముగ్గురు సభ్యుల ముఠాను హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ గుర్తింపు కార్డులు, ధ్రువపత్రాలు, రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ పత్రాలతో స్థలాలు విక్రయించే ముఠా అరెస్ట్
ఇవీ చూడండి: ఏటీఎం ధ్వంసం చేసి చోరికి యత్నించిన దుండుగులు