తెలంగాణ

telangana

ETV Bharat / city

Fake Tickets in TTD: తిరుమలలో నకిలీ టికెట్ల బాగోతం.. కానిస్టేబుల్‌ సహా నలుగురిపై కేసు - తిరుమలలో మరోసారి నకిలీ టికెట్లు

తిరుమలలో మరోసారి నకిలీ టికెట్ల బాగోతం బయటపడింది. ఈ వ్యవహారంలో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. తిరుమలలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కృష్ణారావు, స్కానింగ్ ఆపరేటర్‌ నరేంద్ర, లడ్డూ కౌంటర్‌ ఉద్యోగి అరుణ్‌రాజు, ట్రావెల్ ఏజెంట్ బాలాజీపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు

tirumala fake tickets
తిరుమలలో మరోసారి నకిలీ టికెట్ల బాగోతం

By

Published : Jan 3, 2022, 10:37 PM IST

ఏపీలోని తిరుమల కొండపై శ్రీవారి నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈకేసులో ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కృష్ణారావు, స్కానింగ్ ఆపరేటర్‌ నరేంద్ర, లడ్డూ కౌంటర్‌ ఉద్యోగి అరుణ్‌రాజు, ట్రావెల్ ఏజెంట్ బాలాజీపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు.

మూడు టికెట్లకు రూ.21 వేలు

మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు భక్తులకు నిందితులు నకిలీ దర్శన టికెట్లు విక్రయించారు. మూడు రూ.300 దర్శన టికెట్లను రూ.21 వేలకు అమ్మినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. నకిలీ టికెట్లతో వచ్చిన భక్తులను విచారించిన విజిలెన్స్‌ అధికారులు.. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details