ఏపీ విజయనగరం జిల్లా భోగాపురం పోలీసులు ఆరుగురు సభ్యుల దొంగనోట్ల ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 31 లక్షల విలువైన దొంగనోట్లు, రూ. 64,500 అసలు నోట్లు, 5 చరవాణిలను ముద్రణ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రాజకుమారి వివరాలను వెల్లడించారు.
భోగాపురం మండలం అక్కివరానికి చెందిన కంది రాము ఇంజనీరింగ్ చదివి పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేసి మానేశాడు. చెడు వ్యసనాలకు బానిసై... సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్ ద్వారా దొంగ నోట్లు ముద్రణపై శిక్షణ పొందాడు. ఈ క్రమంలో మరో ఐదుగురితో కలిసి విజయనగరంలోని ఓ జిరాక్స్ దుకాణంలో దొంగనోట్లు ముద్రించారు.