ఏపీలో శిరస్త్రాణం (హెల్మెట్) లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్న వారిపై, సీటు బెల్ట్ ధరించకుండా వాహనం డ్రైవింగ్ చేస్తున్నవారిపై ఆ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు, పోలీసులు కొరఢా ఝళిపిస్తున్నారు.
రహదారి భద్రతలో భాగంగా సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చేసిన సూచనల మేరకు కేంద్రం మోటారు వాహన చట్టంలో సవరణలు చేయగా, అవి గతేడాది సెప్టెంబరు నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం 8 సెక్షన్ల కింద ఉల్లంఘనలకు పాల్పడితే తొలిసారి మూడు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసి, లైసెన్స్‌దారుడికి అవగాహన కార్యక్రమం నిర్వహించాక లైసెన్స్ పునరుద్ధరిస్తారు. మరోసారి అదే తప్పుచేస్తే మాత్రం లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తారు. ఈ వివరాలను వెబ్‌సైట్‌లో అందరికీ తెలిసేలా ఉంచుతారు.
ఈ నిబంధనల్లో సీట్ బెల్ట్ ధరించకుండా వాహనం నడుపుతున్న వారిలో ఎంతమంది లైసెన్స్‌లు రద్దు చేశారో ఆ వివరాలను సుప్రీంకోర్టు కమిటీ కోరింది. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల రవాణాశాఖ ఉప కమిషనర్‌లు ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు ఎన్ని లైసెన్స్‌లు రద్దు చేశారో.. వివరాలు తెలపాలంటూ ఆ శాఖ కమిషనర్ ఇటీవల ఆదేశాలు ఇచ్చారు.