పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు.
'ఇంటర్లా పదోతరగతి పరీక్షల్లో పరిగెత్తడం ఉండదు'
పదో తరగతి పరీక్షలకు కొన్ని నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పరీక్ష ప్రారంభమయ్యే ముందే.. విద్యార్థులు చేయాల్సిన ప్రక్రియ కొంత ఉంటుందని... వీలైనంత ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
telangana ssc exams 2020
వీణా వాణిలకు వేర్వేరు హాల్ టికెట్ల ఇస్తామని... ఒకే చోట పరీక్ష రాస్తారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష రాయనున్న 5 లక్షల 34 వేల మంది విద్యార్థుల కోసం... 2,530 కేంద్రాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణ రెడ్డి ఈటీవీ ముఖాముఖి.
ఇదీ చూడండి:ఖమ్మం జిల్లా కార్మికశాఖ అధికారి ఆనంద్‌రెడ్డి హత్య