ప్రశ్న: ఆంధ్రప్రదేశ్‌లో లక్షకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇలా కేసులు ఎంతకాలం పెరిగే అవకాశముంది ?
జవాబు:
కేసులు పెరిగినప్పుడు ఆందోళన కలగటం సహజం. ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం కావున ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పుడు డబ్లింగ్ టైమ్ తగ్గటంతో కేసులు ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. ఎక్కువగా రికార్డు కావడం కూడా మంచిదే. వారిని గుర్తించటం కటైన్మెంట్ చేసి వ్యాప్తిని అరికట్టగలం.
ప్రశ్న: ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం కాబట్టి కేసులు సంఖ్య పెరుగుతున్నాయంటున్నారు? ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది ?
జవాబు:
ఆగస్టులో పెరిగి సెప్టంబర్ నుంచి డౌన్ ఫాల్ అవుతాయి. ప్రజలు ఎవ్వరూ భౌతిక దూరం పాటించటం లేదు. మాస్కులు, శానిటైజర్ వాడటం లేదు. వచ్చినా మాకు ఏమవుతుందిలే అని యువత పెద్దలకు కరోనా వ్యాపింపజేస్తున్నారు. తప్పకుండా మాస్కులు పెట్టుకొవాలని గుర్తించినప్పుడే కరోనా వ్యాప్తిని అరికట్టగలం.
ప్రశ్న: ఐసియంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎలాంటి పరీక్షలు చేయించుకోవచ్చు ?
జవాబు:
ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఎన్‌ఏబిహెచ్ అక్రిడేట్ ఆసుపత్రి, ఎన్‌ఏబిఎల్ ల్యాబ్స్, కొన్ని పెద్ద ల్యాబుల్లో యాంటిజన్ టెస్టు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చాం. వీరు ఆరోగ్యశ్రీ సీఈవోకు అప్లికేషన్ పెట్టుకోవాలి. దీనికి ధర 750 రూపాయలు నిర్ణయించాం. యాంటిజన్ టెస్టులో నెగటివ్ వస్తే అదే శాంపిల్‌ను వీఆర్డీఎల్ ల్యాబ్‌కు పంపి ఆర్టీపీసీఆర్ చేయించాలి దీనికి 2800 రూపాయలు నిర్ణయించాం.
ప్రశ్న: యాంటిజన్ టెస్టులో రాకపోతే ఆర్టీపీసీఆర్‌కు వెళ్లాలన్నారు. రెండు టెస్టుల భారం రోగి భరించాలా ?
జవాబు: యాంటిజన్ టెస్టుకు 60 శాతం సెన్సిటివిటి ఉంది. ఆర్టీపీసీఆర్ టెస్టుకు 70 శాతం ఉంది. అత్యవరసం అన్నప్పుడు యాంటిజన్ టెస్టు చేయాలి. కొద్దిగా ఆలస్యం అయినా ఇబ్బంది లేనప్పుడు ఆర్టీపీసీఆర్ చేయాలి. ఈ రెండు పరీక్షలు నుంచి తప్పించుకునే పరిస్థితి తక్కువగా ఉంటుంది. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి సీటీ స్కాన్ చేయించుకున్నా మరలా ఆర్టీపీసీఆర్ చేయించుకోవాలి. యాంటిజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఖచ్చితంగా కోవిడ్ ఉందా లేదా అని చెబుతాయి.
ప్రశ్న: ఎక్స్‌రే ద్వారా కూడా నిర్ధారించవచ్చా ?
జవాబు: