భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి మొదటి నుంచి భారతీయుల్లో ఉంది. అందుకే జాతకాలు, వాస్తు, చిలక జోస్యం, పంచాంగాలకు అధిక ప్రాధాన్యమిస్తుంటారు. భవిష్యత్‌పై ఉండే ఆసక్తిని రష్యాకు చెందిన ఓ కంపెనీ క్యాష్ చేసుకోదలచింది. దానికోసమే పేస్‌యాప్‌ను తయారు చేసి మార్కెట్లో వదిలిపెట్టింది. గూగుల్ ప్లే స్టోర్‌లో అడుగుపెట్టిన అనతికాలంలోనే వంద మిలియన్లకు పైగా డౌన్లోడ్లను సొంతం చేసుకుందంటే ఈ యాప్‌కున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ తరహా ఫేస్‌యాప్‌లు గతంలో అనేకం వచ్చినా.. దీనకున్న కచ్చితత్వం, యూజర్ ఫ్రెండ్లీనెస్తో ఆదరణ పొందింది.
ఎప్పుడెలా ఉంటారు!
ఇందులో ఉన్న ఏజ్ ఫిల్టర్లు ఒక మనిషి వృద్ధాప్యంలో ఎలా ఉంటారు, యవ్వనంలో ఎలా ఉంటారు, ప్రస్తుతం ఎలా ఉన్నారో వ్యత్యాసాన్ని మార్ఫ్ చేసి చూపెడుతుంది. ఎవరికైనా తమ ఓట్ఫిట్పై ఇతరులు ఏమనుకుంటారో అనే ఉత్సుకత దీనికి క్రేజ్ పెరిగేలా చేస్తోంది. ప్రస్తుత ఫొటోను, యాప్‌లో మార్ఫ్ చేసిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి సంబురపడుతున్నారు. కేవలం యువతే కాదు పిల్లల నుంచి పెద్దల వరకు, సెలబ్రెటీలు, అన్ని రంగాల, అన్ని వయస్సుల వారిని ఈ యాప్ యమ అట్రాక్ట్ చేస్తోంది.
నాగ్.. ఫేస్యాప్కే ఛాలెంజ్
2002లో నాగ్ ‘మన్మథుడు’ స్టిల్, 2019లో ఫేస్ యాప్ స్టిల్‌ను పక్కపక్కన ఉంచి అన్నపూర్ణ స్టూడియోస్ ఓ ఫొటోను షేర్ చేసింది. దానికి మన్మథుడు-2’లో ఇంకా యంగ్‌గా ఉన్న నాగ్ ఫొటోను కూడా జత చేసింది. నాగ్ అందాన్ని తగ్గించడం ఈ యాప్ తరం కూడా కాదని వర్ణిస్తూ.. ‘నాగ్ ఫేస్ యాప్ ఛాలెంజ్‌కే ఓ ఛాలెంజ్‌లాంటి వారు’ అని ట్వీట్ చేసింది. బాలీవుడ్లో అనిల్‌కపూర్‌ను కూడా మరో యాభై ఏళ్లైనా, ఎన్ని యాప్లొచ్చినా... ఏకే వయస్సు పెరగదంటూ నెటిజన్లు ట్వీట్తున్నారు.