తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీశైలం కుడి కాలువకు లైనింగ్‌ చేస్తే 88,796 క్యూసెక్కులు

శ్రీశైలం కుడి ప్రధాన కాలువకు లైనింగ్​ చేస్తే... 88,796 క్యూసెక్కుల నీటిని మళ్లించడానికి అవకాశం ఉందని సెంట్రల్ డిజైన్​ ఆర్గనైజేషన్​ పేర్కొంది. ఈ మేరకు అంతర్​ రాష్ట్ర జలవనరుల విభాగానికి ఈ విషయాన్ని నివేదించింది. రాయసీమ ఎత్తిపోతల పథాకానికి వ్యతిరేకంగా సుప్రీంలో మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం... అదనపు డాక్యుంమెంట్లను సమర్పించనుంది.

extra wter gain with lining for srisailam right canal
లైనింగ్‌ చేస్తే 88,796 క్యూసెక్కులు

By

Published : Aug 16, 2020, 9:21 AM IST

శ్రీశైలం కుడి ప్రధాన కాలువకు లైనింగ్‌ చేస్తే 88,796 క్యూసెక్కుల నీటిని మళ్లించడానికి అవకాశం ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ పేర్కొంది. అంతర్‌ రాష్ట్ర జలవనరుల విభాగానికి ఈ విషయాన్ని నివేదించింది. శ్రీశైలం నుంచి రోజూ మూడు టీఎంసీలు ఎత్తిపోసేలా ఆంధ్రప్రదేశ్‌ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం, శ్రీశైలం కుడి ప్రధాన కాలువకు లైనింగ్‌ పనులు చేపట్టనున్న పరిస్థితుల్లో శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టంతో ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ గేట్లు తొమ్మిది ఎత్తితే 1,14,297 క్యూసెక్కులు, పది గేట్లు ఎత్తితే 1,26,942 క్యూసెక్కులు మళ్లించడానికి అవకాశం ఉందని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం పేర్కొంది. దీనిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని అంతర్‌ రాష్ట్ర జలవనరుల విభాగం.. సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో)ను కోరింది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా నీటిని తీసుకొనే శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ప్రస్తుతం ఉన్నట్లుగానే ఉంచి లైనింగ్‌ చేస్తే 88,796 క్యూసెక్కులు మళ్లించడానికి అవకాశం ఉందని, 1,26,942 క్యూసెక్కులు మళ్లించాలంటే కాలువను వెడల్పు చేయాల్సి ఉంటుందని(బెడ్‌విడ్త్‌ పెంచడం) సీడీవో నివేదించింది.

అదనపు డాక్యుమెంట్ల అందజేత

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ పలు డాక్యుమెంట్లతో సుప్రీంకోర్టులో మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసిన తెలంగాణ.. తాజాగా మరిన్ని అదనపు డాక్యుమెంట్లను సర్వోన్నత న్యాయ స్థానానికి సమర్పించింది. కృష్ణాజలాలపై 2013లో బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా సుప్రీంకోర్టు స్టే ఇవ్వగా, దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని పేర్కొంటూ వారం క్రితం తెలంగాణ సుప్రీంకోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపింది. దీనిపై విచారణ ప్రారంభం కాకముందే ఈ నెల 12న అదనంగా 16 డాక్యుమెంట్లను సుప్రీంకోర్టుకు సమర్పించింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ ఎదుట 1973లో ఆంధ్రప్రదేశ్‌ సమర్పించిన నివేదిక; 1976, 1997, 1983లలో చెన్నై తాగునీటి సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య జరిగిన ఒప్పందాలు; పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, శ్రీశైలం కుడి ప్రధాన కాలువల సామర్థ్యం పెంపునకు 2005లో ఇచ్చిన జీవోలు; 2007లో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌పై ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగు రీసెర్చి ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదిక; 2015లో కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ వద్ద రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చల నివేదిక, సీడీవో ఇచ్చిన నివేదిక.. ఇలా మొత్తం 16 అంశాలకు సంబంధించి అదనపు డాక్యుమెంట్లను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

ABOUT THE AUTHOR

...view details