తెలంగాణ

telangana

ETV Bharat / city

SSC Exam Fee Date Extension : పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు - tenth exam fee date

Extension of payment of tenth class examination fee in telangana
పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

By

Published : Jan 28, 2022, 1:36 PM IST

Updated : Jan 28, 2022, 3:33 PM IST

13:34 January 28

Extension of payment of tenth class examination fee

SSC Exam Fee Date Extension : పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ఫిబ్రవరి 14 వరకు పదో తరగతి విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చునని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. ఆలస్య రుసుము 50 రూపాయలతో ఫిబ్రవరి 24 వరకు.. 200 రూపాయలతో మార్చి 4 వరకు..500 రూపాయలతో మార్చి 14 వరకు చెల్లించవచ్చునని ఉత్తర్వుల్లో పేర్కొంది.

విద్యార్థులు చెల్లించిన ఫీజును ప్రధానోపాధ్యాయులు డీఈఓలకు.. జిల్లా విద్యాధికారులు ఎస్సెస్సీ బోర్డుకు పంపించే గడువును కూడా పొడిగించారు. పాఠశాలలకు సెలవులు కొనసాగుతున్నందున.. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీలను సవరించారు.

Last Updated : Jan 28, 2022, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details