ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును ఉన్నత విద్యా మండలి మరోసారి పొడిగించింది. మే 15 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, ఎడ్ సెట్, పీఈసెట్ దరఖాస్తుల గడువు పొడిగించినట్టు పేర్కొన్నారు. మే 2 నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. జూన్లో ఎంట్రన్స్ టెస్ట్లు నిర్వహించాలని భావిస్తున్న ఉన్నత విద్యా మండలి... లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకోనుంది.
ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు - ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు
రాష్ట్రంలో నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును ఉన్నత విద్యా మండలి మరోసారి పొడిగించింది. మే 2 నుంచి జరగాల్సిన పరీక్షలను ఇప్పటికే వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులను బట్టి జూన్లో నిర్వహించాలని భావిస్తోంది.
![ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు extend all entrance tests application last date](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7002038-thumbnail-3x2-asdf.jpg)
ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు