తెలంగాణ

telangana

ETV Bharat / city

Experts visit tirumala ghat road: కనుమ దారులను పరిశీలించిన నిపుణుల బృందం - kerala experts team

తిరుమల కనుమ దారులను నిపుణుల బృందం పరిశీలించింది. కొండ‌చ‌రియ‌లు విరిగిన ప్రాంతంలో చేపట్టాల్సిన పున‌రుద్ధర‌ణ ప‌నులు, భ‌విష్యత్‌లో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా తీసుకోవలసిన చర్యలపై.. ల్యాండ్‌ స్లైడ్స్ నిపుణులు నివేదిక తయారు చేయనున్నారు.

తిరుమల
తిరుమల

By

Published : Dec 5, 2021, 8:55 PM IST

తిరుమల కనుమ దారులను నిపుణుల బృందం పరిశీలించింది. కేరళ కొల్లంలోని అమృత విశ్వవిద్యాల‌యంలో "వరల్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ల్యాండ్‌ స్లైడ్ డిజాస్టర్ రిడక్షన్" కింద అంత‌ర్జాతీయ ప్రాజెక్ట్ చేస్తున్న బృందం.. తిరుమలకు ఘాట్ రోడ్డును పరిశీలించింది.

కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం వీరిని తితిదే ఆహ్వానించింది. కొండ‌చ‌రియ‌లు విరిగిన ప్రాంతంలో చేపట్టాల్సిన పున‌రుద్ధర‌ణ ప‌నులు, భ‌విష్యత్‌లో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా తీసుకోవలసిన చర్యలపై.. ల్యాండ్‌ స్లైడ్స్ నిపుణులు నివేదిక తయారు చేయనున్నారు.

కనుమ దారులను పరిశీలించిన నిపుణుల బృందం

ఇదీ చదవండి:venkaiah naidu news: 'ప్రజాస్వామ్యాన్ని అవినీతి నాశనం చేస్తోంది'

ABOUT THE AUTHOR

...view details